అమ్మకు సాయం: బాలింతలకు ప్రభుత్వం ప్రకటించిన పథకాల వివరాలు

మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ రోజు రోజుకీ  కష్టంగా మారుతోంది. చాలా వరకూ నివారించదగిన కారణాలతోనే అత్యధిక మరణాలు నేటికీ సంభవిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేస్తోందిది. ఈ నేపధ్యంలో  కేంద్రప్రభుత్వం ‘మాతృత్వ లబ్ధి’ కార్యక్రమాన్ని అమలు జరుపుతోంది. మాతాశిశు మరణాల్ని అరికట్టడమే ఈ ఫథకం ధ్యేయం. నగదు రూపంలో ప్రసూతి సాయం అందిస్తున్నారు. బాలింత లేదా తొలిసారి సంతానం పొందే గర్భిణికి లబ్ధి కలిగిస్తున్నారు. ఈ కార్యక్రమం కింద మహిళా శిశు సంక్షేమ శాఖ సొమ్ము మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లిస్తుంది. నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో నగదు జమచేస్తున్నారు. కేంద్రం అమలు జరుపుతున్న జాతీయ ఆరోగ్య విధానం నాణ్యమైన వైద్యానికి హామీనిస్తోంది.  2022 నాటికి మాతృ మరణాల్ని గణనీయంగా తగ్గించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్- ‘అన్న అమృతహస్తం’ పథకం అమలుచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ‘ఆరోగ్య లక్ష్మి’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేశంలోని పలు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మాతృత్వ సహయోగ్ యోజనను దేశమంతటికీ విస్తరింపజేస్తామని ప్రధాని ఇదివరకే ప్రకటించారు. పోషకాహార పంపిణీ ద్వారా మాతా శిశు మరణాల్ని అదుపుచేయాలని నిర్ణయించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారు, ఇతరత్రా ఏదైనా చట్టాల ద్వారా ఇలాంటి లబ్ధి పొందుతున్నవారికి ఈ పథకం వర్తించదు. 

  National Maternity Benefit Scheme  ‘జాతీయ సామాజిక సహాయక కార్యక్రమం’ (National Social Assistance Pro-gramme)లో ఇది ఒకటి. ఈ పథకానికి కావల్సిన వనరులను  కేంద్రం నిధుల నుంచి రాష్ట్రాలకు సమకూరుస్తారు. లబ్ధిదారులైన గర్భి ణులకు లభించాల్సిన సహాయక నిధులను ప్రసవానికి ముందు 8 నుంచి 12 వారాల మధ్యలో అందిస్తారు. జన్మించిన నూతన శిశువుకు పోలియో, బీసీజీ మొదలైన వ్యాధి నిరోధక టీకాల సదుపాయాన్ని  కల్పిస్తారు.  సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం: (Integrated Child Development Services)  ఈ పథకాన్ని 1975లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు  పిల్లలు ఈ పథకంలో లబ్ధిదారులు. పోషక, ఆరోగ్య స్థాయిని పెంపొందించడం; పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలకు తోడ్పడటం; మరణాల రేటు, అనారోగ్యం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యాలు. లబ్ధిదారులకు పౌష్టికాహారం, విటమిన్ ‘ఎ’, ఐరన్, ఫోలిక్‌యాసిడ్, టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణ, మంచినీటి సదుపాయం, పారిశుధ్యం మొదలైన సౌకర్యాలను అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా  అందిస్తారు. ప్రస్తుతం ఐఇఈ పథకం యూపీఏ ప్రభుత్వంలో జాతీయ కార్యక్రమంగాఅమల వుతోంది.